చేపల వలలు కొనేందుకు వెళ్తూ.. అనంత లోకాలకు

Lorry Accident At Jagtial 3 Youth Dead - Sakshi

లారీ ఢీ కొనడంతో ముగ్గురు యువకుల దుర్మరణం

జగిత్యాలక్రైం: చేపల వేటకు అవసరమైన వలల కోసం వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని మంచినీళ్ల బావివద్ద జగిత్యాల–నిజామాబాద్‌ ప్రధాన రహదారిపై బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండ ల కేంద్రానికి చెందిన అర్ముల్ల పవన్‌ (21), అర్ముల్ల శ్రీకాంత్‌ (26), ఐలవేని నవీన్‌ (21) బుధవారం మధ్యాహ్నం చేపల వలలు కొనేందుకు బైక్‌పై జగిత్యాలకు బయల్దేరారు. జగిత్యాల మంచినీళ్ల బావి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో పవన్, శ్రీకాంత్, నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదా నికి కారణమని బాధితుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top