ఆస్తి వివాదం: వృద్ధుడు చేసిన పనికి నాలుగు ప్రాణాలు బలి

Kerala Old Man Sets Sons Family On Fire Over Property Disputes - Sakshi

సాక్షి కేరళ(ఇడుక్కి): ఆస్తుల విషయంలో తన పర భేదాన్ని మరిచిపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. ఆఖరికి తన కడుపున పుట్టిన వాళ్లు అని కనికరం కూడా ఉండదేమో. బహుశా ఆస్తి మీద ఉ‍న్న వ్యామోహం మానవతా విలువలు మరిచి పశువులా ప్రవర్తించేలా చేస్తుందేమో. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఆస్తి విషయమై కన్న కొడుకు, మనవరాళ్లు అనే బాంధవ్యాన్ని మరిచి నిద్రిస్తున్నప్పుడే పెట్రోల్‌ పోసి ఇంటికి నిప్పంటించాడు. వాళ్లెవ్వరు బతికి బయట పడకూడదని పక్కా ప్లాన్‌తో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. ఆస్తి తగాదాల కారణంగా కేరళలోని ఇడుక్కిలో 79 ఏళ్ల హమీద్‌ తన కొడుకు కుటుంబాన్ని పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ వృద్ధుడు వాళ్లు నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో కొడుకు, కోడలు, ఇద్దరు మనవరాళ్లు  చనిపోయారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే హమీద్‌ ఇంటికి తాళం వేసిన తర్వాత కిటికి లోంచి పెట్రోల్‌ నింపిన బాటిళ్లను విసిరి అనంతరం నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు సైతం వారిని కాపాడలేకపోయారని వెల్లడించారు. అతను పక్కా ప్లాన్‌తో వాటర్‌ ట్యాంకును ఖాళీ చేయడమే కాక పక్కనున్న బావి నుంచి నీళ్లు తోడి ఎవరైన కాపాడతారేమోనని బావి వద్ద ఉండే నీళ్లు తోడే బకెట్‌ని కూడా తీసేశాడని చెప్పారు. ఇంటి లోపల దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే స్థానికులు హమీద్‌ పెట్రోల్‌ పోసి హత్య చేయడం చూశామని చెప్పడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
(చదవండి: సాగర్‌ కాల్వలో తేలిన కారు.. వీడిన మిస్టరీ, ఆ పని అన్నాచెల్లెలే చేశారు!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top