ఒంటరిగా వెళ్తున్న యువతిపై లైంగిక దాడికి యత్నించిన బాలుడు.. ప్రతిఘటించడంతో..

Kerala: Boy Drags Woman To Farm Molesting Her Got Arrested Kondotty - Sakshi

కొచ్చి: ఒంటరిగా న‌డిచివెళుతున్న యువ‌తిని బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ బాలుడు. తీరా ఆమె ప్రతిఘటించడంతో రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొండొట్టి ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం అర్థరాత్రి ఓ యువతి తన ఇంటి నుంచి కొట్టుక్కర జంక్షన్ వైపు కొండొట్టిలోని కంప్యూటర్ సెంటర్‌కు వెళ్తోంది. అంతలో ఓ బాలుడు ఆమెను వెంబడించి వెనుక నుంచి పట్టుకుని సమీప పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి  ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తనపై రాళ్లతో దాడి చేశాడు.

అయితే నిందితుడి వద్ద నుంచి అతి కష్టం మీద తప్పించుకున్న యువతి అక్కడికి సమీపంలోని తన ఇంటికి వెళ్లి జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తెలిపిన ఆధారాలు మేరకు పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 10వ తరగతి విద్యార్థి, రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్‌గా పోలీసుల విచారణలో తేలింది. మొదట్లో నిందితుడు తానీ నేరం చేయలేదని విచారణలో తెలిపాడు. అయితే పోలీసులు కాస్త గట్టిగా అడగడంతో నిజాన్ని అంగీకరించాడు. దీంతో ఆ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరచనున్నారు.

చదవండి: Online Dating: మొదట డేటింగ్‌..ఆపై ఇంటికి రప్పించుకుని నీళ్లలో మత్తుమందు కలిపి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top