కర్ణాటకలో ఇద్దరు ఐఎస్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

Karnataka Police Arrest Two Islamic State Terrorists - Sakshi

శివమొగ్గ: నిషేధిత ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) కదలికలపై కర్ణాటక పోలీసులు నిఘా వేశారు. ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. మరో టెర్రరిస్ట్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద పేలుడు పదార్థాలు లభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా.. వారిని కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top