ఉద్యోగం వచ్చింది కానీ.. అంతలోనే..

Karnataka: Man Dies Over Road Accident Hit By Lorry - Sakshi

మైసూరు(బెంగళూరు): చామరాజనగర తాలూకా, మలెయూరు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే జిల్లా గుండ్లుపేట తాలూకా నిట్ర గ్రామానికి చెందిన జగదీష్‌(27) మృతి చెందాడు. ఇతను ఒక కంపెనీలో లారీ డ్రైవర్‌గా ఎంపికయ్యాడు. లైసెన్స్‌ కోసం చామరాజనగర్‌లోని ఆర్టీఓ కార్యాలయానికి బైక్‌పై వెళ్తుండగా మలెయూరు వద్ద రాళ్లలోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొంది. తీవ్రగాయాలతో జగదీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చామరాజనగర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటనలో..
కత్తితో దాడిచేసిన విద్యార్థి
హోసూరు: విద్యార్థులు గొడవపడి కత్తులతో పొడుచుకున్న సంఘటన జరిగింది. జిల్లాలో కావేరిపట్టణం దగ్గర పన్నిహళ్లిపుదూర్‌ గ్రామానికి 15 ఏళ్ల విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. సోమవారం మామిడిపండ్లు తింటూ పోట్లాటకు దిగారు.  ఓ విద్యార్థి కత్తితో మరో విద్యార్థిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు చికిత్స కోసం కావేరిపట్టణం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చేరుకొని దాడికి పాల్పడిన విద్యార్థిని అరెస్ట్‌ చేశారు. 

చదవండి: Cm Stalin: తమిళనాడులో.. ప్రపంచస్థాయి మేధస్సు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top