ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు

Kakinada: Joint Collector Action Inodaya Hospital Not Follow Aarogyasri - Sakshi

సాక్షి,  తూర్పు గోదావరి:  ప్రభుత్వ నిబంధనలను పాటించని ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇటీవల పెద్దాపురానికి చెందిన కరోనా రోగి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేస్తూ రూ.4.50 లక్షలను ఆస్పత్రి సిబ్బంది వసూలు చేశారు.

ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యంపై సర్పవరం పీఎస్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యింది. ఆస్పత్రిపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇనోదయ ఆస్పత్రిని డీ నోటిఫై చేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి రూ.15-20 లక్షల జరిమానా కూడా విధించారు. ఆస్పత్రి యాజమాన్యంకు సహకరించిన ఆరోపణలపై ఆరోగ్య మిత్ర నాగమణిని విధుల నుంచి తొలగించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.

చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top