Amnesia Pub Case: రొమేనియా బాలిక వాంగ్మూలంతో వెలుగులోకి 

Jubilee Hills Amnesia Pub Case: Remand Report Shocking Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ బంజారాహిల్స్‌:     రొమేనియా బాలికపై జరిగిన ఘాతుకం కేసుకు సంబంధించి మరో కోణంలోనూ పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ నేరానికి పాల్పడిన నిందితులు ఆమ్నేషియా పబ్‌లో మరో బాలికతోనూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ అంశం రొమేనియా బాలిక వాంగ్మూలంతో వెలుగులోకి వచి్చనా ఇప్పటివరకు తదుపరి చర్యలు తీసుకోలేదు.

అలా చేస్తే నిందితులపై మరో కేసు నమోదవుతుందనే ఒత్తిళ్ల నేపథ్యంలోనే పోలీసులు మిన్నకుండిపోయారని తెలుస్తోంది. మరోపక్క ‘కారులో బాలిక’ వీడియోలను వైరల్‌ చేసిన మూడు యూట్యూబ్‌ చానళ్లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిని మీడియాకు విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై చర్యలు తీసుకునే అంశంలోనూ పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.  

అది కాలేజీ పార్టీ కాదు ... 
ఆమ్నేíÙయా పబ్‌లో గత నెల 28న జరిగింది ఓ కార్పొరేట్‌ స్కూల్‌కు సంబంధించిన ఫేర్‌వెల్‌ పార్టీ అని ఇప్పటివరకు భావించారు. పబ్‌ సిబ్బందిని క్షుణ్ణంగా విచారించిన పోలీసులు అది ఓ ప్రైవేట్‌ పార్టీగా తేల్చారు. నగరానికి చెందిన హాదీ, సుల్తాన్‌ తదితరులు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. హాదీ రొమేనియా బాలికను పార్టీకి హాదీ తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు వీళ్లు వెళ్లగా... 3.15 గంటలకు నిందితులు వచ్చారు. పబ్‌లోనే ఈమెకు మరో బాలికతో పరిచయమైంది. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో సమీపించిన సాదుద్దీన్, ఉమేర్‌లతో పాటు మిగిలిన నిందితులు అసభ్యంగా ప్రవర్తించారు.

దీంతో విసుగు చెందిన బాలికలు ఇద్దరూ పార్టీ ముగియడానికి ముందే పబ్‌ నుంచి బయటకు వచ్చేశారు. మరో బాలిక క్యాబ్‌లో వెళ్లిపోగా.. హాదీ కోసం ఎదురుచూస్తూ రొమేనియా బాలిక బయటే ఆగింది. ఈ సమయంలో బయటకు వచి్చన ఎమ్మెల్యే కుమారుడు, నిందితులు ఆకర్షణీయమైన మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేటర్‌ కుమారుడు కీలకంగా వ్యవహరించాడు.

కాగా కారులోనూ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కాన్సూ బేకరీ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి వెళ్లిపోవడానికి బాలిక సిద్ధమవగా.. ఇంటి వద్ద దింపుతామన్న నిందితులు, బెంజ్‌ కారులో పెట్రోల్‌ అయిపోయిందని చెప్పి ఇన్నోవాలో ఎక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు బేకరీ వద్ద నుంచే వెళ్లిపోయాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు బేకరీకి వచ్చారు. తాము ఎంజాయ్‌ చేశామని గ్రూప్‌ ఫోటో దిగి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. అక్కడ నుంచి ఎవరి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ వివరాలు రొమేనియా బాలిక, నిందితుల వాంగ్మూలాల్లో బయటకు వచ్చాయి.  

పోక్సో చట్టం కింద కేసు నమోదుకు అవకాశం 
    చిన్నారులపై జరిగే లైంగిక దాడులు నిరోధించడానికి ఉద్దేశించిన పోక్సో చట్ట ప్రకారం ఏదైనా నేరం జరిగిందని తెలిసీ ఫిర్యాదు చేయకపోవడం, తదుపరి చర్యలు తీసుకోకపోవడం సైతం నేరమే. అలాగే పబ్‌లో మరో బాలిక పట్ల సాదుద్దీన్, ఉమేర్‌ తదితరులు అసభ్యంగా ప్రవర్తించడమూ నేరమే అవుతుంది. దీనికి సంబంధించి ఆ బాలిక లేదా ఆమె సంబం«దీకుల నుంచి వాంగ్మూలం నమోదు చేసి పోక్సో చట్టం కింద మరో కేసు రిజిస్టర్‌ చేయడానికి ఆస్కారం ఉంది.

కానీ నగర పోలీసులు మరో బాలికను గుర్తించి, వాంగ్మూలం నమోదు చేయడం దిశగా చర్యలు తీసుకోలేదు. ఆమెపై జరిగిన అసభ్య ప్రవర్తన విషయం తెలిసినప్పటికీ మిన్నకుండిపోయారు. సోమవారం పోలీసులు పబ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడూ ఈ దృశ్యం వారికి స్పష్టంగా కనిపించింది. నిందితుల రిమాండ్‌ రిపోర్టులోనూ ఈ అంశాలను పోలీసులు చేర్చారు.  

ఎమ్మెల్యే కుమారుడికి చెక్‌ పెట్టేందుకే వీడియో? 
    ఈ ఉదంతానికి సంబంధించి బయటకువచి్చన వీడియోల చిత్రీకరణ వెనుక మరో కోణం ఉన్నట్లు నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే కుమారుడు, ఈ కేసులో నిందితులు స్నేహితులే అయినప్పటికీ వారి మధ్య కొన్ని స్పర్ధలు ఉన్నాయి. ఎమ్మెల్యే కుమారుడు వీరిపై ఆధిపత్యం చెలాయిస్తుండేవాడని సమాచారం. దీంతో అతడికి చెక్‌ పెట్టడానికి అవకాశం కోసం మిగిలిన వాళ్లు ఎదురు చూశారు. బెంజ్‌ కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే కుమారుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఇది చూసిన ఉమేర్‌ తన ఫోన్‌ను ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి ఇచ్చి రికార్డు చేయించాడు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని బెదిరించాలని వాళ్లు భావించారు. అయితే దారుణం బయటకు వచ్చి కేసు నమోదు కావడం, పోలీసుల గాలింపు నేపథ్యంలో వీడియోలను మరో రకంగా వాడుకున్నారు. ఆ ఉదంతంలో తమ తప్పు లేదని, బాలిక సమ్మతితోనే అంతా జరిగిందని చెప్పడానికి ఎంపిక చేసుకున్న వారికి ఓ నిందితుడి తండ్రి లీక్‌ చేశాడు. ఇలా చేసిన వ్యక్తితో పాటు నిందితులకు ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచి్చన వారికీ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.  

ఎమ్మెల్యేపై కేసు వద్దంటూ ఒత్తిళ్లు... 
    సంబంధించిన కారులోని వీడియోలు వైరల్‌ చేస్తున్న యూట్యూబ్‌ చానళ్లు, సోషల్‌ మీడియాపై చర్యలకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే యూట్యూబ్‌ను పరిశీలించిన అధికారులు ఈ వీడియోలు పోస్టు చేసిన మూడు యూట్యూబ్‌ చానళ్లను గుర్తించారు. ఆదివారం వాటిపై సుమోటో కేసులు నమోదు చేసిన అధికారులు ఓ చానల్‌ రిపోర్టర్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

అయితే బెంజ్‌ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కుమారుడిపైనా, ‘కారులో బాలిక’వీడియోలను మీడియాకు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుపైనా కేసు నమోదు చేసే విషయంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. చట్ట ప్రకారం ఈయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అలా చేస్తే అది రాజకీయ ఇబ్బందులకు కారణమవుతుందంటూ పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. 

న్యాయస్థానంలో బాలిక వాంగ్మూలం 
    జూబ్లీహిల్స్‌ పోలీసులు రొమేనియా బాలికను సోమవారం న్యాయస్థానానికి తీసుకువెళ్లి మేజి్రస్టేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఆయన సమక్షంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం సేకరించారు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని ఆరో నిందితుడిగా చేర్చాలని ఎట్టకేలకు పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ఫోరెన్సిక్‌ నిపుణులు సోమవారం మరోసారి బెంజ్, ఇన్నోవా కార్లను తనిఖీ చేసి పలు నమూనాలు సేకరించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top