ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. | An Illegal Affair That Took The Life Of Man In Nizamabad | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..

Nov 1 2020 2:47 PM | Updated on Nov 1 2020 2:57 PM

An Illegal Affair That Took The Life Of Man In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నగరంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. నాగారం ప్రాంతంలో నివాసం ఉంటున్న సాల్మన్ రాజు అనే వ్యక్తి గత ఏడాది కాలంగా ఆర్యనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ప్లంబర్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ పక్కన నివాసం ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త ఉమాకాంత్ వీళ్లిద్దరూ కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రాడ్‌తో సల్మాన్ రాజ్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు ఉమాకాంత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement