నన్ను బాగా చూసుకుంటానని నమ్మించి ఇల్లు అమ్మించాడు.. కానీ

Hyderabad: Lady Lodged Police Complaint Against Her Son - Sakshi

సాక్షి,బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): తనను కులం పేరుతో దూషించడమే కాకుండా వృద్ధురాలిని అని కూడా చూడకుండా వేధిస్తున్నారని కుమారుడు, కోడలుపై ఓ మహిళ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... బర్కత్‌పురా దివాకర్‌ గార్డెన్స్‌లో నివసించే బి.హేమలత(65)కు కుమారుడు శ్రీకాంత్‌ ఉన్నాడు. 2017లో సింధూరారెడ్డి అనే యువతితో శ్రీకాంత్‌ సహజీవనం చేస్తున్నాడు.

అప్పటి నుంచే తనకు కష్టాలు ప్రారంభమయ్యాయని, తనను కొడుతూ ఇంట్లో నుంచి తరిమేశాడని, ఇప్పుడు తాను అనాథగా మారానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బాగా చూసుకుంటానని గత మార్చి నెలలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లోని తన ఇంటికి తీసుకొచ్చాడని నమ్మించి మీర్‌పేట్‌లో ఉన్న ఇల్లును అమ్మించాడని, ఆ తర్వాత తన బాగోగులు చూడటం లేదని ఆరోపించారు.

ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటూ తరిమారని, తనను చంపేందుకు కూడా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు సింధూర రెడ్డి, శ్రీకాంత్‌లపై ఐపీసీ సెక్షన్‌ 509, ఎస్సీ, ఎస్టీ, సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top