డ్రగ్‌ కేసు: గోవాలో కీలక సూత్రధారి ఎడ్విన్‌ అరెస్ట్‌

HYd Police Arrest Edwin Nunes In Goa In Drug Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోవా డ్రగ్‌ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ నూనిస్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవా కేంద్రంగా దేశ్యావ్యాప్తంగా డ్రగ్స్‌ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత 15 రోజులుగా ఎడ్విన్‌ కోసం గోవాలో పోలీసులు గాలిస్తుండగా.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రోజు రాత్రి వరకు అతన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. కాగా ఎడ్విన్‌ గోవా కర్లీస్ రెస్టారెంట్‌, పబ్ యజమాని.

ఇక ఇదే కేసులో మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్‌ను హైదరాబాద్‌ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  బోర్కర్‌ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని హైదరాబాదులో సరాఫరా చేస్తుంటాడు. ఇతను గోవాలోని అంజునా బీచ్‌ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్‌ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్నాడు. ఈ  ఘరానా పెడ్లర్‌ ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌ను హెచ్‌–న్యూ ఆగస్టు 17న పట్టుకుంది.

ఇతడికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్‌ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగాట్‌ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అయితే నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవాలో పలువురుపై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు ఈ క్రమంలోనే మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఎడ్విన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top