ప్రియుడితో రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన భర్త 

Husband Exposed Her Wife Illicit Affair - Sakshi

ఆళ్లగడ్డ(కర్నూలు): ప్రియుడితో రాసలీలలు జరుపుతున్న భార్యను భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించిన సంఘటన ఆళ్లగడ్డ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల రెండో వీధిలో ఓ ఆటోడ్రైవర్‌ వాసం ఉంటున్నాడు. అతనికి ఓ సామాజికవర్గం హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడితో పరిచయం ఏర్పడింది. తనకు రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉందని మాయమాటలు చెప్పి ఆటోడ్రైవర్‌ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిపై భర్తకు అనుమానం రావడంతో సదరు వ్యక్తిని తన ఇంటికి రావొద్దని చెప్పాడు. (చదవండి: ఆవు దూడపై అత్యాచారం)

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా ఇరుగుపొరుగు వారు గమనించి ఫోన్‌ చేసి చెప్పారు. భర్త వచ్చి భార్య, ప్రియుడు ఇంట్లో ఉండటం గమనించి గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితుడు చెప్పారని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ)    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top