డ్యూటీకెళ్లిన భర్త.. ఇంటికొచ్చేసరికి భార్య అదృశ్యం.. చివరికి.. | Housewife Missing Under Suspicious In Hyderabad | Sakshi
Sakshi News home page

డ్యూటీకెళ్లిన భర్త.. ఇంటికొచ్చేసరికి భార్య అదృశ్యం.. చివరికి..

Sep 12 2022 8:32 PM | Updated on Sep 12 2022 8:32 PM

Housewife Missing Under Suspicious In Hyderabad - Sakshi

లక్ష్మీప్రసన్న

అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

దుండిగల్‌(హైదరాబాద్‌): అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చర్చిగాగిల్లాపూర్‌ చైతన్య కాలనీకి చెందిన సుధాకర్, లక్ష్మిప్రసన్న(23) భార్యాభర్తలు. కాగా ప్రైవేట్‌ ఉద్యోగి అయిన సుధాకర్‌ ఈ నెల 10వ తేదీన డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి వచ్చాడు.
చదవండి: హాస్టల్‌లో కామాంధుడు.. విద్యార్థులకు అశ్లీల వీడియోలు చూపించి..

అయితే భార్య ఇంట్లో లేకపోవడంతో చుట్టు పక్కల వారిని వాకబు చేయగా తెలియదని చెప్పారు. ఆందోళన చెందిన అతను లక్ష్మిప్రసన్న సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోడంతో భర్త సుధాకర్‌ ఆదివారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement