Medak: ఒకేరోజు ఏడు చోట్ల చోరీలు  మరువక ముందే..

House Robbery Mystery In Medak - Sakshi

సాక్షి,  జోగిపేట(మెదక్‌): జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో అందోలులో ఇంటికి తాళాలు వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే స్థానికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం ఒకేరోజు ఏడు చోట్ల దొంగతనాలు జరిగిన సంఘటన మరువకముందే శనివారం మరోసారి దొంగలు రెచ్చిపోయారు.  

రొయ్యలగూడెం కాలనీలో వరుసగా తాళాలు వేసిన ఏడు ఇళ్లు, రెండు కిరాణ దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఇళ్లకు వేసిన  తాళాలు పగులగొట్టి నగదు, బియ్యం బస్తాలను అపహరించారు.  

► రొయ్యల యాదమ్మ ఇంటి తాళం పగులగొట్టి క్వింటాల్‌ బియ్యం, ఎల్లమ్మ ఇంట్లో నుంచి 50 కిలోల బియ్యం,  బంగారం, లచ్చమ్మతో పాటు మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ నాలుగు ఇళ్లవారు హైదరాబాద్‌లో ఉన్న కారణంగా ఇంట్లో ఏఏ వస్తువులు పోయాయో పూర్తి వివరాలు తెలియరాలేదు.  
 రాజుకు చెందిన కిరాణా షాప్‌లో రూ.5వేల నగదు, సిగరెట్‌ ప్యాకెట్లు, డీవీడీ రాజుకు చెందిన కిరాణా డబ్బా షట్టర్‌ కట్‌ చేసి వెళ్లిపోయారు.  
► ఈ విషయమై ఎస్‌ఐ వెంకటేష్‌ను వివరణ కోరగా రొయ్యల యాదమ్మ, రాజులు మాత్రమే ఫిర్యాదు చేశారన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు.   

చదవండి: దారుణం: 8 మందిని బలిగొన్న నిర్లక్ష్యం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top