భూమా ఫ్యామిలీకి ఎంత చెప్పినా వినలేదు | Hafeezpet Land Dispute Is Reason For Bowenpally Kidnap Says Victim's Relativete | Sakshi
Sakshi News home page

భూమా ఫ్యామిలీకి పార్ట్‌నర్స్‌‌తో గొడవే కిడ్నాప్‌నకు కారణం

Jan 6 2021 11:06 AM | Updated on Jan 6 2021 4:07 PM

Hafeezpet Land Dispute Is Reason For Bowenpally Kidnap Says Victim's Relativete - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బోయినపల్లి ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్‌ కేసుకు హఫీజ్‌పేటలోని 50 ఏకరాల భూవివాదమే కారణమని బాధితుల బంధువు ప్రతాప్‌ తెలిపారు. ఆ భూమికి సంబంధించి చాలా మంది పార్ట్‌నర్స్ ఉన్నారని, ఆ భూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్‌లు అన్నీ ఉన్నాయని తెలిపారు. భూమా కుటుంబం, వాళ్ల పార్ట్‌నర్స్ మధ్య విభేదాలు కిడ్నాప్‌నకు దారి తీశాయని చెప్పారు.  భూమా వర్గం వారి పార్ట్‌నర్స్‌తో తేల్చుకోవాలని చాలాసార్లు చెప్పామన్నారు. భూ వివాదంలో వాళ్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రెండేళ్ల క్రితమే తమని సంప్రదించారని, అప్పుడే అన్ని డాక్యుమెంట్లు చూపించామన్నారు. అయినప్పటికి భూమా కుటుంబం మళ్లీ తమ మీదకే వివాదానికి వచ్చిందని తెలిపారు. తాము పోలీసులకు చెప్పిన అనుమానితుల్నే కిడ్నాపర్లుగా తేల్చారన్నారు. (బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు‌: ఆ ముగ్గురు క్షేమం)

కాగా, మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్‌ పాయింట్, రాణిగంజ్‌ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement