గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్‌ కేసు | Gujarat cops book BJP MLA Gajendrasinh Parmar for rape after High Court order | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్‌ కేసు

Oct 20 2024 5:20 AM | Updated on Oct 20 2024 5:20 AM

Gujarat cops book BJP MLA Gajendrasinh Parmar for rape after High Court order

గాందీనగర్‌: గుజరాత్‌ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రంతిజ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గజేంద్రసిన్హ్‌ పర్మార్‌ 2020 జూలై 30న గాందీనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కు తనను పిలిపించుకున్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని దళిత బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తన ఫోన్‌కాల్స్‌కు ఆయన స్పందించలేదని తెలిపింది. 

ఓసారి మాత్రం తమ మధ్య సంబంధం విషయం ఎవరికైనా చెబితే కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలు పెడతానంటూ కులం పేరుతో దూషించారని పేర్కొంది. ఈ మేరకు ఆమె అందజేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో, బాధితురాలు 2021లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరును ప్రశ్నించింది. ఎమ్మెల్యేపై వెంటనే అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గాం«దీనగర్‌ సెక్టార్‌–21 పోలీస్‌స్టేషన్‌ పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర కేసులు పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement