పెళ్లింట విషాదం.. కాలం కాటు వేసింది | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం.. కాలం కాటు వేసింది

Published Sat, Apr 30 2022 7:27 AM

Groom Killed In Road Accident In Karnataka - Sakshi

తుమకూరు: తుమకూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవ వరుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం.. అరసీకెరె తాలూకాలోని కమలాపురకు చెందిన నంజుండప్ప కుమారుడు ప్రసన్న(30)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో రెండు వారాల క్రితం వివాహం జరిగింది.

శుక్రవారం తెల్లవారుజామున ప్రసన్నతో పాటు సంతోశ్‌(29), డ్రైవర్‌ చిన్నప్ప (30)తో కలిసి ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు తీసుకురావడానికి ఇన్నోవా కారులో బయలుదేరారు. తెల్లవారుజామున బెంగళూరు నగరం మాయసంద్ర మార్గంలో వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తురువెకెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement