ఫస్ట్‌నైట్‌ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి

Groom Commits Suicide in Guntur District - Sakshi

సాక్షి, తాడేపల్లి రూరల్‌: ఓ నవ వరుడు బలవన్మరణానికి పాల్పడిన  సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... మాచర్ల సాగర్‌ రింగ్‌రోడ్‌కు చెందిన సత్యనారాయణరాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు పత్తిగుడుపు కిరణ్‌కుమార్‌ (32)కు ఈ నెల 11వ తేదీ తెనాలి వించిపేటకు చెందిన యువతితో వించిపేటలో వివాహం జరిగింది. 12వ తేదీ భార్యను తీసుకుని మాచర్ల వెళ్లాడు. 16వ తేదీ మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. దీంతో తెనాలి వచ్చేందుకు బయలుదేరిన కిరణ్‌కుమార్‌ గుంటూరు బస్టాండ్‌లో నాలుగు గంటల సమయంలో దిగగానే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.

చదవండి: (బాలికతో వ్యభిచారం కేసులో మరో 10 మంది అరెస్ట్‌)

రాత్రి అయినా రాకపోవడంతో  అతని సెల్‌ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్విచ్చాఫ్‌లో ఉండటంతో కిరణ్‌కుమార్‌ బంధువులకు సమాచారం అందించారు. అనంతరం తెనాలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు సమాచారం అందడంతో బయటకు తీసి పరిశీలించారు. పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది.

మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌లో సిమ్‌ను తీసి పరిశీలించి బంధువులకు సమాచారం ఇవ్వగా తల్లి విజయలక్ష్మి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన కుమారుడేనని గుర్తించింది. ఫస్ట్‌నైట్‌ అంటే భయపడ్డాడని, వారి స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి కట్టుకున్న భార్యను, మమ్మల్ని అన్యాయం చేశాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top