మైనర్‌పై సోదరుల గ్యాంగ్‌ రేప్‌.. అడ్డొచ్చిన బామ్మపైనా..! | Girl Gang Raped Killed By Her Cousins In Madhya Pradesh Jabalpur | Sakshi
Sakshi News home page

మైనర్‌పై సోదరుల హత్యాచారం.. అడ్డొచ్చిన బామ్మపైనా అఘాయిత్యం

Aug 25 2022 10:31 AM | Updated on Aug 25 2022 11:41 AM

Girl Gang Raped Killed By Her Cousins In Madhya Pradesh Jabalpur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వరుసకు సోదరులయ్యే ఇద్దరు యువకులు ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా కొట్టి హత్య చేశారు.

భోపాల్‌: దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసినవారే రాక్షసుల్లా మారి దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లాలో వెలుగు చూసింది. వరుసకు సోదరులయ్యే ఇద్దరు యువకులు ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు వచ్చిన ఆమె బామ్మపైనా నిందితుల్లో ఒకడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

బాధితురాలు తన తండ్రితో కలిసి ముంబైలో నివాసం ఉంటోంది. ఆగస్టు 11న జబల్‌పూర్‌లోని తన పెదనాన్న వాళ్ల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 13న బాలికపై ఆమె ఇద్దరు కజిన్‌ సోదరులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రోజుల తరబడి అఘాయిత్యానికి పాల్పడుతూ తీవ్రంగా కొట్టారు. బాధితురాలిని గమనించిన కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. జబల్‌పూర్‌లోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. 

తన కూతురిపై ఇద్దరు సోదరులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడి తీవ్రంగా కొట్టటం వల్ల ప్రాణాలు కోల్పోయిందని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దుశ్చర్యను ఆపేందుకు వెళ్లిన తన తల్లిపైనా అత్యాచారం చేశారని, ఆమె చెబితేనే తనకు అసలు విషయం తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఎస్‌పీ ప్రదీప్‌ కుమార్‌ వెల్లడించారు. ఆగస్టు 23న బాధితురాలి మృతదేహాన్ని పరీక్షించామని, వృద్ధురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. పోక్సోతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నిందితుల్లో ఒకరని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి చికిత్స అందించిన వైద్యులను ప్రశ్నించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రైవేట్‌ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement