breaking news
girl gang raped
-
మైనర్‌పై సోదరుల గ్యాంగ్ రేప్.. అడ్డొచ్చిన బామ్మపైనా..!
భోపాల్: దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసినవారే రాక్షసుల్లా మారి దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లాలో వెలుగు చూసింది. వరుసకు సోదరులయ్యే ఇద్దరు యువకులు ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు వచ్చిన ఆమె బామ్మపైనా నిందితుల్లో ఒకడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తన తండ్రితో కలిసి ముంబైలో నివాసం ఉంటోంది. ఆగస్టు 11న జబల్పూర్లోని తన పెదనాన్న వాళ్ల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 13న బాలికపై ఆమె ఇద్దరు కజిన్ సోదరులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రోజుల తరబడి అఘాయిత్యానికి పాల్పడుతూ తీవ్రంగా కొట్టారు. బాధితురాలిని గమనించిన కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. జబల్‌పూర్‌లోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. తన కూతురిపై ఇద్దరు సోదరులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి తీవ్రంగా కొట్టటం వల్ల ప్రాణాలు కోల్పోయిందని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దుశ్చర్యను ఆపేందుకు వెళ్లిన తన తల్లిపైనా అత్యాచారం చేశారని, ఆమె చెబితేనే తనకు అసలు విషయం తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఎస్పీ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. ఆగస్టు 23న బాధితురాలి మృతదేహాన్ని పరీక్షించామని, వృద్ధురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. పోక్సోతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నిందితుల్లో ఒకరని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి చికిత్స అందించిన వైద్యులను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై.. -
పార్టీకి పిలిచి.. గ్యాంగ్ రేప్
* నగరంలో వీకెండ్ పార్టీలో దారుణం * ఈ నెల 5న ఘటన... ఆలస్యంగా వెలుగులోకి... హైదరాబాద్: హైదరాబాద్‌లో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. పీకల్లోతు వరకు మద్యం సేవించిన ‘మృగాళ్లు’ తోటి ఉద్యోగినిపైనే అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్భయ వంటి కఠినమైన చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇలాంటి వారి పైశాచికత్వానికి కళ్లెం వేయలేకపోతున్నాయి. వీకెండ్ పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు తమతో పాటు పని చేసే యువతిని నగర శివార్లలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. వారిలో ఒక వ్యక్తి అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టగా, మరో వ్యక్తి సైతం అత్యాచారయత్నం చేశాడు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలను ఏసీపీ భాస్కర్‌గౌడ్ వెల్లడించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి(22) ఉప్పల్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తోన్న నిహాల్(22), శ్రీకాంత్ (23)లు ఇద్దరు ఆమె సహోద్యోగులు. ఈ నెల 5న వారు ఆమెను వీకెండ్ పార్టీకంటూ ఆహ్వానించారు. తనతోపాటు పని చేసే ఉద్యోగులు కావడంతో ఆమె వారితో వెళ్లింది. పథకం ప్రకారం వారు హయత్‌నగర్‌లోని కుసుమానగర్కు చెందిన తమ స్నేహితుడు షైనీ ఇంటికి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి బాగా మద్యం సేవించారు. మద్యం మత్తులో నిహాల్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ కూడా ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మరుసటి రోజు ఉదయం నిహాల్ ఆమెను ఎల్బీనగర్ రింగురోడ్డు వద్ద దింపి వెళ్లాడు. తనపై జరిగిన దాడి, అవమానం పట్ల ఆవేదనకు గురైన ఆమె ఈ నెల 15న తల్లిదండ్రులతో వచ్చి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిహాల్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని కేసును విచారణ చేపట్టారు. నిందితులపై అత్యాచారం కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. రహస్యంగా విచారణ.... ఇలా ఉండగా ఈ కేసు విచారణలో గోప్యతను పాటిస్తోన్న పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. నిందితుల వివరాలు కూడా బయటకు చెప్పడం లేదు. మరోవైపు హయత్‌నగర్‌లో పార్టీ చేసుకొనేందుకు తన ఇంటిని స్నేహితులకు అప్పగించిన షైనీ పార్టీ జరిగే సమయంలో వారితోనే ఉన్నాడా, లేడా వంటి వివరాలు వెల్లడించడం లేదు. మరోవైపు ఈ నెల 15న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా 23వ తేదీ వరకు పోలీసులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం, మీడియా దృష్టికి రాకుండా జాగ్రత్తలు పాటించడం గమనార్హం.