‘పుష్ప’ తరహాలో గంజాయి రవాణా.. క్యాబేజీ బుట్టల మాటున దాచి.. | Ganja Smuggling With Cabbage Bags Polise Seized at Pendurthi | Sakshi
Sakshi News home page

‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి రవాణా.. క్యాబేజీ బుట్టల మాటున దాచి..

Published Thu, May 4 2023 3:13 PM | Last Updated on Thu, May 4 2023 3:26 PM

Ganja Smuggling With Cabbage Bags Polise Seized at Pendurthi - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు క్యాబేజీ బుట్టల మాటున గంజాయి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే బొలెరోలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది

దీంతో పెందుర్తి వద్ద పోలీసులు వాహనంలో తనిఖీలు చేపట్టగా గుట్టు రట్టైంది. క్యాబేజీ బుట్టలు కింద 14 బ్యాగుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  బొలెరో వాహనంలో ఒడిశా నుంచి గంజాయిని క్యాబేజీ బుట్టల లోడుతో తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయితో ఉన్న బొలెరో వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement