చైనాలో గ్యాంగ్‌స్టర్‌ కత్తులతో దాడి...ముగ్గురు మృతి

Gangster Attack Knife In China Kinder Garden 3 Killed 6 Wounded  - Sakshi

బీజింగ్‌: చైనా జియాన్స్‌ ప్రావిన్స్‌లోని కిండర్‌గార్డెన్‌లో ఒక గ్యాంగస్టర్‌ కత్తులతో దాడులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గ్యాగ్‌స్టర్‌ టోపీ, ముసుగు ధరించి ఉదయం 10 గంటలకు దక్షిణ చైనాలోని కిండర్‌ గార్డెన్‌లోకి చొరబడి ఈ దాడులకు తెగబడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. చైనాలో  ఇలాంటి నేరాలు జరగడం అత్యంత అరుదు.

పౌరులు తుపాకీలను కలిగి ఉండడాన్ని చైనా కఠినంగా నిషేధిస్తుంది. కానీ చైనాలో గతకొంకాలంగా ఈ దాడులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. గత ఏప్రిల్‌ నెలలో కూడా ఇదే కిండర్‌గార్డెన్‌ కత్తుల దాడిలో ఇద్దరు పిల్లలు మృతి చెందారని, సుమారు 16 మంది దాక గాయపడ్డారని చెప్పారు.

అంతేకాదు షాంఘై ప్రభుత్వాస్పత్రుల్లో కూడా నలుగురు వ్యక్తులు కత్తిపోటుకు గురయ్యరని, గతేడాది జూన్‌లో పాదాచారుల పై కూడా ఇలానే ఒక వ్యక్తి  కత్తుల దాడులకు తెగబడటంతో ఆరుగురు మృతి చెందారని, సుమారు 14 మంది గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ చైనాలో కిండర్‌గార్డెన్‌లో దాడులకు పాల్పడ్డా 48 ఏళ్ల వ్యక్తి పరారీలోనే ఉన్నాడని, అతని ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు.

(చదవండి: ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయనక్కర్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top