కోడలిని లైంగికంగా వేధించిన మామ.. మద్యం తాపి ఇనుప రాడ్‌తో

Four arrested for Murdered Man in Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: కూతురులాగా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేసిన మామను హత్య చేయించిన ఘటన అలస్యంగా హాసన జిల్లా హొళెనరసీపుర తాలూకా దొడ్డహళ్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నవంబర్‌ 13న రాగికావలు గ్రామం సమీపంలోని కొత్త చెరువులో దొడ్డహళ్లికి చెందిన తమ్మణ్ణగౌడ శవం బయట పడింది. ముఖానికి ప్లాస్టిక్‌ సంచితో కట్టి చెరువులో పడేశారు. మృతుడి కొడుకు కుమార ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

వివరాలు.. కోడలు నాగరత్నను మామ తమ్మణ్ణగౌడ లైంగికంగా వేధించేవాడు. కొడుకు పట్టించుకోకపోవడంతో తమ్మణ్ణ ఇదే అదనుగా భావించి కోడలితో ఇష్టారీతిగా వ్యవహరించేవాడు. మామ చేస్తున్న చేష్టలపై నాగరత్న తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. తమ కూతురిని వేధిస్తున్న తమ్మణ్ణను హత్య చేయడానికి నాగరత్న తల్లిదండ్రులు మైలారిగౌడ, తాయమ్మ ఇద్దరికి రూ. 50 వేలకు సుపారీ ఇచ్చారు. అదే నెల 13 రాత్రి తమ్మణ్ణకు ఇంటిలో మద్యం తాపి ఇనుప రాడ్‌తో కొట్టి చంపి సుపారీ తీసుకున్న యోగేశ్, చంద్రేగౌడలు శవాన్ని చెరువులో పడేశారు. హత్య చేసిన నిందితులతో పాటు నాగరత్న తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

చదవండి: (ప్రేమికుల డ్రగ్స్‌ దందా.. సహజీవనం చేస్తూ.. డాన్‌గా ఎదగాలని)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top