హాంకాంగ్‌ మోడల్‌ హత్య: సూప్‌ కుండలో ఆమె తల..కంగుతిన్న పోలీసులు

Found Missing Skull Of Murdered Hong Kong Model In A Pot Of Soup - Sakshi

ఆ కుండలో క్యారట్‌, ముల్లంగి వంటి వాటితో సూప్‌ మాదిరి చక్కగా ఆకర్షణీయంగా ఉండటంతో సూప్‌ అనే అనుకున్నారు. కానీ నిశితంగా గమనించి దగ్గరకెళ్తే..

ప్రముఖ హాంకాంగ్‌ మోడ​ల్‌ అబ్బి చోయ్‌ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తును చేస్తున్న హాంకాంగ్‌ పోలీసులు ఆమె ఛిద్రమైన శరీర భాగాలను నగర శివార్లలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో గుర్తించగా.. తల, మొండెం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఓ కుండలోని సూప్‌ చూసి కంగుతిన్నారు. నిండుగా ఉన్న సూప్‌ని నిశితంగా గమనించి దగ్గరకు వెళ్లితే గాని తెలియలేదు అందులో మోడల్‌ తల భాగం ఉందన్న విషయం. తొలుత ఆ కుండలో క్యారట్‌, ముల్లంగి వంటి వాటితో సూప్‌ మాదిరి చక్కగా ఆకర్షణీయంగా ఉండటంతో సూప్‌ అనే అనుకున్నారు. ఐతే అందులో ఆ మోడల్‌ తల భాగాం పుర్రె మాదిరిగా చూసి.. షాక్‌ గురైనట్లు తెలిపారు.

ముఖం మీద చర్మం, మాంసం భాగాలు ఆ సూప్‌లోనే అవశేషాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జుట్టుతో సహా చోయి పుర్రె ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి  కారులో ఉండగానే ఆమెపై దాడి చేసి ఇంటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మోడల్‌ పుర్రె వెనుక ఉన్న రంధ్రాన్ని బట్టి ఆమెపై ప్రాణాంతక దాడి జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పోలీసుల దర్యాప్తులో.. చోయి మాజీ భర్త, అతని కుటుంబానికి సంబంధించి పది మిలియన్ల డాలర్లతో కూడిని విలాసవంతమైన ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నట్లు తేలింది.

చోయి అదృశ్యం కావడానికి ముందు రోజే చోయి భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్, అత్తగారు జెన్నీ లీ కోర్టుకు హాజరుకాగా, వారికి బెయిల్‌ లభించలేదు. పైగా కోర్టు విచారణను మే 8కి వాయిదా వేసినట్లు వెల్లడించారు.  ఈ మేరకు ఈ దారుణ హత్యకు ఆ నలుగురి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అబ్బి చోయి హాంకాంగ్‌లో ప్రసిద్ధ మోడల్‌ మాత్రమేగాదు,  పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటోంది. ఆమె ఫిబ్రవరి19న చివరిసారిగా ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ ఎల్‌ ఆఫీయల్‌ మోనాక్‌తో కలిసి ఒక ఫోటోషూట్‌ చేసినట్లు సమాచారం. 

(చదవండి: మోడల్‌ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..)
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top