మహిళా అధికారినిపై దాష్టీకం: డ్యూటీలో ఉంది.. అందులోనూ గర్భిణి!

Former Sarpanch His Wife Hitting Woman Ranger And Her Husband - Sakshi

కొంతమంది ఇటీవల కాలంలో అత్యంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అత్యంత దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి అమానుష ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పైగా సాటి మహిళ, గర్భిణి అని చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె పై దాడి చేశారు.

అసలు విషయంలోకెళ్తే....మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అటవీ శాఖలో పనిచేస్తున్న గర్భిణి అధికారి పై పల్సవాడే మాజీ సర్పంచ్‌ అతని భార్య అత్యంత అమానుషంగా దాడిచేశారు. మహిళా అటవీ శాఖాధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా కూలీలను వేరే స్థలంలో పనిలో పెట్టుకున్నారని స్థానిక అటవీ కమిటీలో మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం వాపోయారు.

అంతేకాదు మాజీ సర్పంచ్‌ సోమవారం మహిళా అధికారిణిని ఫోన్‌లో బెదిరించాడు కూడా. ఈ మేరకు మాజీ సర్పంచ్‌  రామచంద్ర గంగారాం జంకర్, అతని భార్య ప్రగతి జంకర్‌.. మహిళా అటవీ అధికారి, ఆమె భర్త పై దాడి చేశారు. పైగా మాజీ సర్పంచ్‌ భార్య ప్రగతి జంకర్‌... సాటి మహిళ, గర్భిణి అనే కనికరం లేకుండా అటవీ అధి​కారి జుట్లు పట్టుకుని లాగి కిందపడేసి, చెప్పుతో కొట్టి అవమానించారు. ఈ మేరకు ఈ ఘటనను ఆ మహిళా ఆఫీసర్‌ భర్త, అటవీ సిబ్బంది రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మాజీ సర్పంచ్‌ని అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.

(చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top