HYD: చాదర్ ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident In Chaderghat Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ పూరి గుడిసెలో మంటలు అంటుకున్నాయి. మంటల కారణంగా గుడిసెల్లో ఉన్న చేతివృత్తుల సామగ్రి అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఫైర్ సిబ్బంది ఎగిసిపడతున్న మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 10కి పైగా గుడిసెలు తగలబడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top