కన్న కూతురిపై కన్నేసిన కామాంధుడు.. అసభ్యకర ప్రవర్తన 

Father Misbehave With Daughter At Hyderabad Case Filed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కామాంధుడైన ఓ తండ్రి కన్న కూతురిపై లైంగికదాడికి యత్నించిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–7లో బాధితురాలు(9) నివాసం ఉంటోంది. బాధితురాలి తండ్రి మక్సూద్‌ హుస్సేన్‌(46) చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం నుంచి తల్లిదండ్రులు విడివిడిగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా మూడు నెలలుగా బాలిక ముభావంగా ఉంటోంది. దీంతో తల్లి బాలికను ప్రశ్నించింది. తండ్రి మక్సూద్‌ హుస్సేన్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక దాడికి యత్నించాడని తెలిపింది. దీంతో బాధితురాలితో కలిసి తల్లి శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. 
చదవండి: నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా...

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top