దారుణం.. కన్న కూతురిని గర్భవతి చేసిన కామాంధుడు 

Father Assaulted Daughter In Anantapur District - Sakshi

గుంతకల్లు టౌన్‌(అనంతపురం జిల్లా): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కాలనాగులా కాటేశాడు. కుమార్తెపై కొన్ని నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగుచూసింది. గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప కథనం మేరకు.. గుంతకల్లులోని భాగ్యనగర్‌కు చెందిన పెయింటర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తి పదిహేనేళ్ల వయసు గల తన పెద్ద కుమార్తెపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు.

చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు

అయితే.. అనుమానం వచ్చిన బాలిక తల్లి అతన్ని మందలించగా ఆమెపైనా దాడి చేశాడు. చివరకు మూడు రోజుల క్రితం బాలికను తీసుకుని తల్లి గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి  వెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం గర్భవతి అని నిర్ధారణ కావడంతో అబార్షన్‌ చేయాలని వైద్యులను కోరారు. ఇందుకు వారు సమ్మతించలేదు. పోలీసులకు సమాచారమిస్తామని తెలిపారు. దీంతో వారు భయపడి ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

బుధవారం తిరిగి సదరు బాలికను కర్నూలు పెద్దాస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. అక్కడా గర్భిణిగా నిర్ధారించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. వారు గుంతకల్లు పోలీసులకు తెలియజేయడంతో ఘటన వెలుగుచూసింది. నిందితుడిపై గుంతకల్లు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలిస్తామని ఎస్‌ఐ సురేష్‌బాబు చెప్పారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top