లైంగిక వేధింపులు: జిమ్మాస్టిక్స్‌ కోచ్‌ ఆత్మహత్య!

Ex Olympics Coach John Geddert Commits Suicide After Sexual Abuse - Sakshi

వాషింగ్టన్‌‌: అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జాన్‌ గెడ్డార్ట్‌ గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గతంలో ఒలింపిక్ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌గా పని చేసిన గెడ్డార్ట్‌ మిచిగన్‌లో‌ మహిళా జిమ్నాస్ట్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో లారీ నాసర్‌ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అనేక మంది మహిళలు జిమ్నాస్టిక్‌ శిక్షణ కోసం ఈ సెంటర్‌కు తరలి వచ్చేవారు. అయితే గెడ్డార్ట్‌, నాసర్‌ అక్కడి మహిళా జిమ్నాస్ట్‌లను లైంగికంగా వేధించడంతో పాటు, మానసికంగా హింసించేవారని నాసల్‌ అనే వ్యక్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు.

నాసల్‌ చేసిన ఆరోపణల మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఎక్కువగా 13, 16 సంవత్సరాల లోపు వయసువారే అని మిచిగాన్‌ అటార్నీజనరల్‌ డెనా నిసెల్‌ తెలిపారు. గెడ్డార్ట్‌, నాసర్‌లు తన కూతురిని కూడా లైంగికంగా వేధించారని ఒక జిమ్నాస్టిక్‌ ట్రైనీ తల్లి ఆరోపించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన జాన్‌ గెడ్డార్ట్‌ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా గెడ్డార్ట్‌ తనను లైంగికంగా వేధించాడని మాజీ జిమ్నాస్ట్‌ రాచెల్‌ డెస్‌హోలాండర్‌ 2000 సంవత్సరంలోనే సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించించిన విషయం తెలిసిందే.

చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top