మాజీ మిస్‌ చెన్నైను ఓ గదిలో బంధించి.. 40 రోజుల పాటు..

Ex Miss Chennai Filed Molestation Case Against Sub Inspector Chennai - Sakshi

గదిలో బంధించిన స్పెషల్‌ ఎస్‌ఐ 

తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు 

సాక్షి, చెన్నై: స్పెషల్‌ ఎస్‌ఐ తనను 40 రోజులు గదిలో బంధించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాజీ మిస్‌ చెన్నై శనివారం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో పళ్లికరణై పోలీసులు కేసును విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పళ్లికరణైకు చెందిన యువతి గతంలో మిస్‌ చెన్నై పోటీల్లో విజేతగా నిలిచారు. ఆమె తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటున్నారు. ఈమెకు ఈస్ట్‌ కోస్టు రోడ్డులో ప్లాట్‌ ఉంది. ఇక్కడ ఇంటి నిర్మాణానికి ఓ బిల్డర్‌ను ఆశ్రయించింది.

అతడు తనను మోసం చేయడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఈ సమయంలో ఎస్‌ఎస్‌ఐ ఆండ్రు కార్వెల్‌తో పరిచయం ఏర్పడింది. కేసు విచారణ పేరిట తరచూ ఆమెను కలిసేవాడు. అదే సమయంలో తన సమస్యలను కార్వెల్‌తో ఆమె పంచుకుంది. ఇదే అదనుగా ఆమె ఇంట్లో కొన్ని పూజలు చేయించాలని పేర్కొంటూ, మత బోధకుల పేరిట కొందర్ని  కార్వెల్‌ రంగంలోకి దించాడు. ప్రార్థనలు, పూజలు అంటూ హంగామా చేసి, చివరకు మాజీ మిస్‌ చెన్నైను ఓ గదిలో బంధించాడు. తనను లొంగ దీసుకునేందుకు 40 రోజుల పాటు ఎస్‌ఎస్‌ఐ ప్రయత్నించాడని, ఆ గదిలో తాను నరకం చూశానని ఫిర్యాదులో పేర్కొంది. తెలిసిన వారి సాయంతో తప్పించుకుని వచ్చినట్లు చెప్పింది. ఎస్‌ఎస్‌ఐ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పళ్లికరణై పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top