ఇంజనీరింగ్‌ పూర్తి: మతిస్థిమితం కోల్పోయి తల్లిని చంపిన కూతుళ్లు  | Engineering Graduate Mentally Disabled Daughters Assassinate Mother | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ పూర్తి: మతిస్థిమితం కోల్పోయి తల్లిని చంపిన కూతుళ్లు 

Jul 22 2021 8:35 AM | Updated on Jul 22 2021 9:42 AM

Engineering Graduate Mentally Disabled Daughters Assassinate Mother - Sakshi

హత్యకు గురైన ఉషా.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

టీ.నగర్‌: తల్లిని హతమార్చిన మతిస్థిమితం లేని ఇద్దరు కుమార్తెలపై కేసు నమోదైంది. తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్‌పిచ్చై, ఉషా (50) దంపతులకు కుమార్తెలు నీనా(21), రీనా(19) ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కోయిల్‌పిచ్చై మున్నీర్‌పల్లంలో ఉంటున్నాడు. నీనా, రీనా ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.

కొద్ది నెలల క్రితం నుంచి కుమార్తెలు ఇరువురికి మతిస్థిమితం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం ఉషాతో కుమార్తెలు గొడవపడ్డారు. కేకలు విని ఇరుగుపొరుగువారు ఉషా ఇంట్లోకి వచ్చి చూడగా ఆమె నిర్జీవంగా కనిపించింది. పోలీసుల విచారణలో కత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement