
సోమవారం ఉదయం ఆలయానికి చేరుకునప్పటికీ.. క్యూ లైన్‌లో గంటల తరబడి..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. రాజన్న దర్శనం కోసం వచ్చిన ఓ భక్తురాలు.. క్యూ లైన్ కుప్పకూలి కన్నుమూసింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
కరీంనగర్ లింగాపూర్‌కు చెందిన లక్ష్మి తన కుటుంబంతో సోమవారమే రాజన్న ఆలయ సన్నిధికి చేరుకుంది. అయితే.. దర్శనం కోసం ఇవాళ వేకువఝామున ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్‌లో నిల్చున్నారు. ఈ క్రమంలో తనకు అస్వస్థతగా ఉందని చెబుతూనే ఆమె కుప్పకూలిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
లక్ష్మిని పరిశీలించిన వైద్యులు.. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు. ఆలయ ప్రాంగంలోనే ఆమె కన్నుమూయడం, లక్ష్మి కూతురి రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.