షాకింగ్‌: సహజీవనం, ప్రియురాలి మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. | Delhi Police Arrested Man Assassinated His Partner Chopped 35 Pieces | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ఘటన: సహజీవనం, ప్రియురాలి మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి..

Published Mon, Nov 14 2022 12:04 PM | Last Updated on Mon, Nov 14 2022 3:25 PM

Delhi Police Arrested Man Assassinated His Partner Chopped 35 Pieces - Sakshi

ఒక జంట ఇంట్లోంచి పారిపోయి సహజీవనం చేశారు. పెళ్లి ప్రస్తావన వచ్చేటప్పటికీ ఇద్దరి మధ్య పెద్ద గొడవయ్యేది. ఆ గొడవ కాస్త దారుణమైన హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...అఫ్తాబ్ అమీన్ పూనావల్ల అనే యువకుడు 26 ఏళ్ల శ్రద్ధా అనే అమ్మాయితో సహజీనం చేస్తున్నాడు. శ్రద్ధా ముంబైలోని ఒక మల్టీనేషనల్‌ కంపెనీ కాల్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. అక్కడే పూనావల్లతో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ఇద్దరూ డేటింగ్‌ చేసుకునేంత వరకు వచ్చింది.

వీళ్లిద్దరి వ్యవహారం శ్రద్ధ వాళ్ల కుటుంబసభ్యులకు నచ్చలేదు. దీంతో వారు ఇంట్లోంచి పారిపోయి ఢిల్లీలోని మెహ్రౌలీలో ఒక ప్లాట్‌కి మకాం మార్చి అక్కడే కలిసి ఉంటున్నారు. ఐతే గత కొద్దిరోజులుగా ఆమె నుంచి కుటుంబసభ్యులకు కాల్స్‌ రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన శ్రద్ధా తండ్రి వికాశ్‌ మదన్‌ ఢిల్లీ వచ్చి ఆమె గురించి వాకాబు చేస్తూ...ఆమె ఫ్లాట్‌ వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన పోలీసులుకు తన కూతురు కనిపించడం లేదంటూ పూనావల్లపై ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం ప్రారంభించారు. పోలీసులు పూనావల్ల కోసం తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్‌ అయ్యారు. విచారణలో పూనావ్లల...తనని శ్రద్ధ తరచూ పెళ్లిచేసుకోమని పోరు పెడుతున్నట్లు తెలిపాడు. పెళ్లి విషయమై ఇద్దరు గొడవపడినట్లు తెలిపాడు.

ఐతే ఒకరోజు ఆ గొడవ తారస్థాయికి చేరుకోవడంతో తాను కోపంతో శ్రద్ధా గొంతుకోసి హతమార్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి ఒక ఫ్రిజ్‌ కొనుక్కుని మరీ భద్రపర్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ ముక్కలను పడేసేందుకు రోజు తెల్లవారుజామున 2 గంటలకు వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లోపడేసి వచ్చినట్లు చెప్పాడు. దీంతో ఈ కేసు మర్డర్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

(చదవండి: మారణాయుధాలతో వచ్చి, అక్షితపై దాడిచేసి...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement