
ప్రతీకాత్మకచిత్రం
చెన్నై: కూతురు ప్రేమ వివాహం ఓ తల్లి హత్యకు కారణమైంది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా తాండరామ్ పట్టు సమీపం పుదుచెక్కడి పంచాయతీ జాంబొడై గ్రామానికి చెందిన పళని (47). ఇతని భార్య రాణి (43). వీరికి రాజపాండి (24), శివ (22) అనే ఇద్దరు కుమారులు, భరణి (21) అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో భరణి మదురైకి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. సోమవారం పళని బంధువులు వారికి ప్రేమ వివాహం జరిపించారు.
రాణికి ఈ విషయం నచ్చకపోవడంతో వివాహానికి హాజరుకాలేదు. ధర్మపురి జిల్లా కోటపట్టిలోని సోదరి ఇంటికి వెళ్లి మంగళవారం వచ్చింది. కుమార్తె వివాహానికి హాజరు కాకపోవడంపై రాణితో పళని గొడవపడ్డాడు. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రాణి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమో దు చేసి పళణిని అరెస్టు చేశారు.