Cyber Fraud Of Lakhs In The Name Of Part Time Job - Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో ఒక్కో లైక్‌కు రూ.50

Published Tue, Mar 14 2023 8:22 AM

Cyber Fraud of lakhs in the name of part time job - Sakshi

హైదరాబాద్: యూట్యూబ్‌లో ఒక్కో లైక్‌కు రూ.50 ఇస్తామని వల వేసి..తొలుత లాభాలు ఇచ్చి నమ్మించి..ఆ తర్వాత కొల్లగొట్టారు సైబర్‌నేరగాళ్లు. ఇలా ఆరుగురి వ్యక్తుల నుంచి దాదాపు రూ.75 లక్షల మేర లూటీ చేయడంతో వారంతా సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఒక్కరోజులో ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో ఇంత పెద్ద మోతాదులో సైబర్‌ కేటుగాళ్లు డబ్బు కాజేయడంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే..భరత్‌నగర్‌కు చెందిన ఓ యువకుడికి పార్ట్‌టెం జాబ్‌ ఉందంటూ వాట్సప్‌ మెసేజ్‌ వచ్చింది.

ఇంట్లో ఖాళీగా ఉన్న ఆ యువకుడు వాట్సప్‌ మెసేజ్‌లో ఉన్న ఫోన్‌నెంబర్‌కు కాల్‌ చేసి పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం వచ్చేలోపు తాము పంపే యూట్యూబ్‌ వీడియోస్‌కు లైక్‌ కొట్టాలన్నారు. ఒక్కో లైక్‌కు రూ.50 ఇస్తామన్నారు. కొద్దిరోజులు ఇలా లైక్‌ రూ.50 చొప్పున చెల్లించారు. దీంతో వీరి మధ్య సాన్నిహిత్యం బలపడింది. ఆ తర్వాత పలు దఫాలుగా రూ.25 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్‌ రూపంలో పెట్టుబడి పెట్టించి ఎగ్గొట్టారు. సిటీకి వలస వచి్చన రైతుకు కూడా ఇదే తరహాలో మెసేజ్‌ వచ్చింది

ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే తక్కువ సమయంలో కోటీశ్వరులు కావొచ్చన్నారు. దీనికి ఒప్పుకున్న రైతు నుంచి పలు దఫాలుగా రూ.25 లక్షలు కాజేశారు. షేక్‌పేట్‌కు చెందిన యువకుడికి పార్ట్‌టెం ఉద్యోగమని చెప్పి రూ.9 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయించారు. యూసఫ్‌గూడ వాసి నుంచి రూ.10 లక్షలు, మలక్‌పేట వాసి నుంచి రూ.4 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.2 లక్షలు కూడా ఇదే పంథాలో కాజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ చెప్పారు.  

Advertisement
Advertisement