గంజాయితో ముగ్గురు అరెస్టు

అరకులోయ రూరల్ : మండల కేంద్రం స్థానిక ఆర్టీసీ కాంప్లేక్స్‌లో 22 కేజీలు గంజాయిని తరలించేందకు సిద్ధంగా ఉన్న ముగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ నజీర్ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.72 వేలు ఉంటుందన్నారు. నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు, ఒక మహిళ ఉన్నరన్నారు. వీరిని మహ్మద్ ఆజాధ్‌ఆలీ, జునైధ్, ఆనమ్ ఆన్సారిలుగా గుర్తించామన్నారు. ఒడిసా రాష్ట్రం పాడువ ప్రాంతం నుంచి అరకులోయ మీదుగా గంజాయి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో పట్టుకున్నామన్నారు.
మరిన్ని వార్తలు