కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా..

Crime: Delhi Man Shared Cousin Wife, Morphed Photos Instagram - Sakshi

Delhi Man Shared Cousin Wife, Morphed Photos: వ్యక్తిగత గొడవల కారణంగా బంధువు భార్యను సోషల్ మీడియాలో వేధించిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని జగత్ పూర్ పుస్తా నివాసి హితేన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జ‌గ‌త్పుర్‌ పుస్తా ఏరియాకు చెందిన హితేన్‌కు త‌న బంధువుతో గొడ‌వ జ‌రిగింది. దాంతో హితెన్ కక్షగట్టి ఎలాగైనా తన బంధువుని వేధించాలని నిర్ణయించుకున్నాడు.

అందుకు హితేన్‌ తన బంధువు భార్య సోషల్‌మీడియా అకౌంట్‌ని టార్గెట్‌ చేశాడు. అదే పనిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నకిలీ ఖాతాని క్రియేట్‌ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను సామాజిక మాధ్యమంలో నుంచి ఆమె ఫొటోల‌ను డౌన్‌లోడ్ చేసుకుని, వాటిని అశ్లీల చిత్రాల్లోని యువ‌తుల ఫొటోల‌తో మార్ఫింగ్ చేసేవాడు. ఆ ఫోటోలను తిరిగి బాధితురాలితో పాటు, ఆమె భ‌ర్త స్నేహితుల‌కు కూడా పంపేవాడు.

ఈ తంతు గ‌త ఎనిమిది నెల‌లుగా కొన‌సాగుతుండంతో విసిగిపోయిన బాధితురాలు చివ‌రికి పోలీసుల‌ను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టగా, ఈ దారుణానికి పాల్పడుతోంది ఆమె బంధువేనని తేలండంతో అతన్ని అరెస్టు చేశారు. కాగా పోలీసులు నిందితుడి కంప్యూట‌ర్ ఐపీ అడ్రస్‌ ద్వారా గుర్తించగలిగారు.

చదవండి: Vikarabad: ప్రమాదమా.. హత్యా! కారుతో ఢీ: కొట్టి చంపే ప్రయత్నం..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top