రూ.70 కోసం వాగ్వాదం: గొడ్డలితో దాడి | Clashes Between Two Members For Rs 70 In Khammam | Sakshi
Sakshi News home page

రూ.70 కోసం వాగ్వాదం: గొడ్డలితో దాడి

Oct 1 2021 10:36 AM | Updated on Oct 1 2021 10:39 AM

Clashes Between Two Members For Rs 70 In Khammam - Sakshi

కేవలం రూ.70 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి చివరకు గొడ్డలితో దాడి చేసుకునేంత వరకు దారి తీసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం అర్బన్‌: కేవలం రూ.70 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి చివరకు గొడ్డలితో దాడి చేసుకునేంత వరకు దారి తీసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ధంసలాపురంలోని కొత్తకాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ కొమ్ము ఉప్పలయ్య సమీప బంధువైన కొమ్ము కోటయ్యకు రూ.70 ఎప్పుడో ఇచ్చాడు.

అయితే తనకివ్వాల్సిన రూ.70 కోసం బుధవారం రాత్రి అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. స్థానికులు సర్దిచెప్పి పంపించారు. అయినా అది మనస్తాపంలో పెట్టుకుని ఇంటికెళ్లాక కోటయ్య కుమారుడు అశోక్‌కు తెలిసి అతను గొడ్డలి తీసుకెళ్లి ఉప్పలయ్యపై దాడి చేశాడు. భుజానికి తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరాడు. గురువారం పోలీసులకు ఫిర్యాదు అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement