జేసీ బ్రదర్స్‌ అనుచరులపై కేసు నమోదు

Case Registered Against JC Brothers Followers In Assault Case - Sakshi

నిన్న మద్యం మత్తులో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ వద్ద హంగామా

ఫర్నిచర్‌, వాహనాలను ధ్వంసం చేసిన జేసీ బ్రదర్స్‌ అనుచరులు

26 మందిపై కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు

సాక్షి, అనంతపురం: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన జేసీ బ్రదర్స్‌ అనుచరులపై కేసు నమోదయ్యింది. నిన్న మద్యం మత్తులో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ వద్ద హంగామా సృష్టించిన జేసీ బ్రదర్స్‌ అనుచరులు.. ఫర్నిచర్‌, వాహనాలను ధ్వంసం చేశారు. జేసీ అనుచరులు 26 మందిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాన్స్‌కో కార్యాలయంలో విందు పార్టీ ఏర్పాటు చేసి గొడవకు కారణమైన ఇద్దరు ఉద్యోగులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

నిన్న అసలేం జరిగిందంటే..
తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్‌ చైర్‌ పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్‌చైర్‌పర్సన్‌ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్‌కుమార్‌ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్‌ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి వెళ్లి మద్యం తాగారు.

వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్‌కుమార్‌ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు.
చదవండి:
పాపం చిన్నారి.. ఊయలే ఉరితాడై .. 
భార్యపై అనుమానం.. తెల్లవారు జామునే నిద్రలేచి..

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top