
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ఆదివారం పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లఘించి హోటల్‌లో మీటింగ్ పెట్టారని తెలియడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లను రెండు నెలల క్రితం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సంగం డెయిరీ ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఏసీబీ అరెస్ట్ చేసింది.