
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక, మృతులు విజయవాడకు చెందినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్దలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని హైస్పీడ్‌లో ఉన్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. కాగా, వీరంతా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి..