యూపీలో బాలికపై ఐదేళ్ల పాటు అత్యాచారం..

BSP, SP leader arrested in Lalitpur minor girl rape molestation - Sakshi

ఎస్పీ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుల అరెస్టు

లలిత్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో లలిత్‌పూర్‌ జిల్లా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు తిలక్‌ యాదవ్, బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) దీపక్‌ అహిర్వార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. తనపై ఐదేళ్లపాటు అత్యాచారం చేశారంటూ బాధితురాలు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సహా మొత్తం 25 మందిపై ఫిర్యాదు చేసింది.

అక్టోబర్‌ 12న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో బాలిక తండ్రి, మామ కూడా ఉన్నారు. శుక్రవారం మీర్జాపూర్‌లో తిలక్‌ యాదవ్, దీపక్‌ అహిర్వార్‌తో పాటు మహేంద్ర దూబే అనే ఇంజనీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో తమ పార్టీ నేత అరెస్టు కావడంతో సమాజ్‌వాదీ పార్టీ లలిత్‌పూర్‌ జిల్లా పార్టీ యూనిట్‌ను రద్దు చేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top