'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను'

Bengaluru: Teacher who put up 1947 Re 1 coin on OLX duped - Sakshi

రూపాయి నాణేన్ని కోటికి కొంటానని.. టీచర్‌కు రూ.లక్ష టోపీ  

సాక్షి, బనశంకరి: 1947 నాటి రూపాయి నాణేన్ని కొనుగోలు చేస్తానని చెప్పి ఉపాధ్యాయురాలికి రూ.లక్ష టోపీ వేశాడు సైబర్‌ మోసగాడు. బెంగళూరు సర్జాపుర రోడ్డులో ఉండే టీచర్‌ (38) తన వద్ద 1947 నాటి అరుదైన రూపాయి నాణెం ఉందని, విక్రయిస్తానని జూన్‌ 15 తేదీన ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో ప్రకటన ఇచ్చి మొబైల్‌ నెంబరు పెట్టింది. ఓ వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి తాను రూ.కోటికి కొంటానని చెప్పి ఆమె బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నాడు.

అంత డబ్బు మీ ఖాతాలోకి పంపాలంటే కొన్ని పన్నులు కట్టాలి అని ఆమె నుంచే పలుసార్లు రూ.లక్ష వరకు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. అతడు మళ్లీ మళ్లీ డబ్బులు కట్టాలని కోరడం, గట్టిగా అడిగిన తరువాత అతని ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో మోసపోయినట్లు తెలుసుకున్న టీచరమ్మ వైట్‌పీల్డ్‌ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top