మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి.. చివరికి

Banjara Hills: Man Cheats First Wife And Married Second Wife - Sakshi

  భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

సాక్షి, బంజారాహిల్స్‌: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ సమీపంలో నివాసముండే బి.సందీప్‌ ప్రసాద్‌ అనే వ్యక్తికి గతంలోనే పెళ్లయి ఒక కొడుకున్నాడు. కొన్నేళ్లుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(31)తో సన్నిహితంగా ఉంటున్న సందీప్‌ తన భార్యతో విడాకులు తీసుకున్నానని నమ్మించాడు.

జనవరిలో యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోలేదని తెలుసుకుని నిలదీయడంతో ముఖం చాటేశాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు మోసం చేసిన సందీప్‌ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ 420, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: నాలుగు నెలల్లో రెట్టింపు నగదు.. లగ్జరీ కారు.. కట్‌ చేస్తే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top