రెండేళ్లుగా ప్రేమ.. ప్రియురాలు లేని లోకం వద్దని..

Bangalore: Youth Suicide Over Love Dies - Sakshi

మండ్య: మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు....తాలూకాలోని చొట్టనహళ్లికి చెందిన రశ్మి (17), ఆలదహళ్లి గ్రామానికి చెందిన శశాంక్‌ గౌడ (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరేమోనని ఆందోళనతో శనివారం రాత్రి రశ్మి ఇంటిలో ఉరి వేసుకుంది. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న శశాంక్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ప్రియురాలు లేని ప్రపంచంలో జీవించలేనని ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.   

బాలికా హంతకునికి జీవితఖైదు
కోలారు: మూడేళ్ల చిన్నారి పాపను కిడ్నాప్‌ చేసి హత్య చేసిన కేసులో మాలూరు తాలూకా హుల్కూరు గ్రామానికి చెందిన మునిరాజుకు జీవితఖైదుతో పాటు రూ. 55 వేల జరిమానా విధిస్తూ శనివారం జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. మునిరాజు 2019 ఏప్రిల్‌ నెల 11వ తేదీన ఇదే గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాలికను ఎత్తుకెళ్లి రాజకాలువ వద్ద గొంతునులిమి హత్య చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మాలూరు పోలీసులు మునిరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు మునిరాజుకు శిక్షను విధించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top