ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు  | Baby Girl Sold in Nalgonda District | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు 

Jan 13 2024 3:30 AM | Updated on Jan 13 2024 3:30 AM

Baby Girl Sold in Nalgonda District - Sakshi

తిరుమలగిరి(నాగార్జునసాగర్‌): పుట్టిన నాలుగురోజులకే ఆడ శిశువును అమ్మేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా చూసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం రంగండ్ల గ్రామానికి చెందిన ఆంగోతుసేవ– జ్యోతి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జ్యోతి గత సంవత్సరం సెపె్టంబర్‌ 16న నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది.

అయితే ఇద్దరు ఆడపిల్లలను సాకే స్తోమత లేదని పుట్టిన శిశువును అమ్ముతామని ఆదే ఆస్పత్రిలో పనిచేస్తున్న స్వీపర్‌ ఈసం వరమ్మకు చెప్పారు. సంతానం లేక ఇబ్బంది పడుతున్న నాంపల్లి మండలం పసునూరుకు చెందిన బత్తుల సైదులు– కవిత దంపతులకు వరమ్మ ఈ విషయాన్ని చేరవేసింది. దీంతో వారు సెస్టెంబర్‌ 20న సేవ–జ్యోతి దంపతులకు రూ1.50 లక్షలు ఇచ్చి ఆ శిశువును తీసుకెళ్లారు.

కాన్పు తర్వాత పాప కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి అంగన్‌వాడీ టీచర్‌కు చెప్పారు. ఆమె చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సేవ–జ్యోతి దంపతులతోపాటు, ఆడశిశువును కొన్న సైదులు–కవిత దంపతులు, స్వీపర్‌ వరమ్మను శుక్రవారం అరెస్టు చేశారు. ఆడశిశువును నల్లగొండలోని శిశుగృహకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement