
కర్ణాటక (యశవంతపుర): నీళ్లు ఇవ్వరా కొడకా అన్నందుకు ఒక ఆటో డ్రైవర్‌పై మరొక డ్రైవర్ దాడిచేసి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన నగరంలో పీణ్య పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆటో డ్రైవర్ అజయ్ జాలహళ్లి క్రాస్ ఆటోస్టాండ్‌లో ఉండగా మరొక ఆటో డ్రైవర్ సిద్ధిక్ (23)వెళ్లి... ఏమిరా కొడకా, నీళ్లు ఉంటే ఇస్తావా అని అడిగాడు. తీవ్ర కోపానికి గురైన అజయ్ సిద్ధిక్‌తో గొడవ పడ్డాడు. నన్నే కొడకా అంటావా? అని దాడి చేశాడు. అజయ్ చాకుతో పొడవడంతో తీవ్ర గాయాలైన సిద్దిక్‌ను ఇతర ఆటో డ్రైవర్లు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.