అనకాపల్లిలో వ్యక్తి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి..

Andhra Pradesh Anakapalle Man Eliminated Body Chopped - Sakshi

సాక్షి, అనకాపల్లి: జిల్లాలోని ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెం సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు తల, మొండెం, కాళ్లను వేర్వేరుగా పడేశారు. ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద శరీర భాగాలు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. క్రికెట్ ఆడేందుకు వెళ్లిన స్థానిక యువకులు మృతదేహాన్ని మొదటగా చూసి పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top