
లక్డీకాపూల్: సంచలనం సృష్టించిన నల్లగొండ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. గుండె నొప్పి రావడంతో ఆయనను గత నెల 22వ తేదీన నల్లగొండ జైలు అధికారులు చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ సాయి సతీష్ అతని ఆరోగ్య పరిస్థితిని విచారించిన నేపథ్యంలో మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించారు.
దీంతో ఆయనను నిమ్స్‌లోని కార్డియోథొరాసిక్ విభాగానికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ బారీకి సీటీ సర్జన్ డాక్టర్ అమరేష్‌రావు మాలెంపాటి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించారు. అతనికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన బైపాస్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
(చదవండి: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన)