ఘోరాతి ఘోరంగా.. కాళ్లు చేతులు కట్టేసి.. కారం చల్లి

65 Year Old Women Tied Up And Molestation In Kabrai - Sakshi

లక్నో: 65 ఏళ్ల అవ్వపై ఓ అంకుల్‌ కక్ష సాధించాడు. ఆమె ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పినా వెళ్లకపోవడంతో ఆమెపై అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అని చూడకుండా ఆమెపై బలత్కారం చేశాడు. దారుణాతి దారుణంగా కాళ్లు, చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం కారం పొడి చల్లి క్రూరంగా ప్రవర్తించాడు. చివరకు ఆమెను కట్లు విప్పకుండానే వెళ్లిపోయాడు. దీంతో ఆమె అచేతనంగా పొలంలో పడి ఉండగా గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

మహోబా జిల్లా కబ్రాయ్‌ పట్టణంలో 65 ఏళ్ల వృద్ధురాలి నివసిస్తోంది. ఆమెకు సమీపంలోనే నివసించే భరత్‌ కుశ్వహ శనివారం అర్ధరాత్రి వృద్ధురాలిని బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జననాంగాల వద్ద తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం కారం పొడి చల్లి క్రూరంగా ప్రవర్తించాడు. అతడికి సేవాలాల్‌ అనే వ్యక్తి కూడా సహకరించాడు. ఆమె కనిపించకపోవడంతో ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు వెతుకుతుండగా పొలం వద్ద వృద్ధురాలు తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉంది. వెంటనే వారు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే తమ వివరాలు చెబితే చంపేస్తామని హెచ్చరించారని కూడా బాధితురాలు పోలీసులకు చెప్పింది.

బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు నిందితులను గాలించి పట్టుకున్నారు. వారిపై పలు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే తమ ఆనవాళ్లు లభించకుండా వృద్ధురాలిపై కారం చల్లినట్లు తెలుస్తోంది. వారు చేసిన గాయాలపై కారం చల్లడంతో ఆమె తీవ్రంగా అల్లాడిపోయింది. ఈ పరిస్థితిని పోలీసులకు వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే తాను ఉంటున్న ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లాలని ఒత్తిడి చేసినట్లు.. కొన్ని రోజుల కిందట దాడికి కూడా పాల్పడినట్లు తెలిపింది. వినకపోవడంతో ఇలా చేశారని తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top