బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం | 5 charred to death after private bus catches fire in Karnataka Chitradurga | Sakshi
Sakshi News home page

బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం

Aug 12 2020 8:51 AM | Updated on Aug 12 2020 8:58 AM

5 charred to death after private bus catches fire in Karnataka Chitradurga - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయపుర నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు  మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలో హిరియూర్ తాలూకాలోని కెఆర్ హళ్లి వద్ద జాతీయ రహదారిపై అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.

32 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ బస్సులో ఇంజీన్ సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు.  క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిరియూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న హిరియూర్ ఎస్పీ రాధిక సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement